
జనం న్యూస్ అక్టోబర్ 12 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని జనగామ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం భక్తులకు గాయత్రీ దేవి ( బ్రహ్మచారి ) రూపంలో భక్తులకు కనువిందు చేశారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మండపంలో ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చనలు పుష్పార్షణ వంటి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు అమ్మవారి మాలలు ధరించినటువంటి స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు అమ్మవారిని గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటున్నారు.