
జనం న్యూస్ అక్టోబర్ 24 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జీవీఎంసీ అనకాపల్లి కార్పొరేటర్లు పరిధిలో ఉన్న 6 వార్డులు శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ బిజెపి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ అనకాపల్లి టిడిపి ఇన్చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ కార్యకర్తలు నాయకులు అభిప్రాయాలను తీసుకొని కార్పొరేటు అభ్యర్థులను నిర్ణయించారని, వారు విజయానికి కార్యకర్తలు నాయకులు సమిష్టి కృషి తో పనిచేసి ఇంటింటి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఓటర్లు ఘన స్వాగతం పలుకుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ నూకంబిక అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల వెంకటరావు శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ బిజెపి సీనియర్ నాయకులు బొడ్డేడ అప్పల నరసయ్య శ్రీ కనకదుర్గ ఆలయం డైరెక్టర్ దూలం ప్రసాద్ గొల్ల వీధి శ్రీరామాలయం అధ్యక్షులు బోడి వెంకటరావు అభ్యర్థుల విజయం తధ్యమని గంటపదంగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులతో అనకాపల్లి జిల్లాకు 6 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం వల్ల అనకాపల్లి జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు రావడం జరిగిందని, ఈ ప్రాంతం ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు నిండుగా వస్తున్నాయని, స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ అనకాపల్లి ప్రాంతాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నిత్యం ప్రజా సమస్యల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని, ముఖ్యంగా సాగునీటికి రైతాంగానికి ప్రాధాన్యతను ఇచ్చి పంట కాలువలు గ్రోయిన్ మరమ్మతులు పోలవరం ఎడమ కాలువ ద్వారా రైతులకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు ఇప్పటికే కల్పించడం జరిగిందని, రావు గోపాలరావు కళాకేంద్రాన్ని ఆధునీకరణ, క్రీడా రంగానికి ప్రాధాన్యతనిస్తూ రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం 6 కోట్లతో ఆధునికరణ, ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ ఆస్పత్రిని 24 గంటలు పనిచేసే విధంగా ఏర్పాటు చేశారని, కిడ్నీ డయాలసిస్ సెంటర్, సిటీ స్కాన్ అన్ని వ్యాధులకి డాక్టర్లను నియమించారని, పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారని, ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ఆమల జరుగుతున్న తీరును గమనించి, కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని ఓటర్లు నిర్ణయానికి వచ్చారని, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించినట్ల యితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ఓటర్లు ఇప్పటికైనా తీసుకున్నారని వైసీపీ అభ్యర్థులకు మరోసారి బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని వెంకటరావు సత్యనారాయణ అప్పల నరసయ్య వెంకటరావు ప్రసాదు అన్నారు..//