
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా కడప ఆర్ అండ్ బి బంగ్లాలో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ని టీఎన్ ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణు గోపాల్ మర్యాద పూర్వ కంగా కలిశారు.తెలుగు దేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తో కలిసి మంత్రి సవిత ని కలిసినట్లు వేణుగోపాల్ తెలిపారు.ఈ సంద ర్భంగా నందలూరు మండలానికి సంబంధిం చిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. మండ లానికి సంబంధించిన ప్రజా సమస్యలు చర్చించ డం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల క్లస్టర్ ఇంచార్జ్ పసుపు లేటి ప్రవీణ్ కుమార్, మండల కో క్లస్టర్ ఇంచార్జ్ చుక్క యానాది, నాయ కులు రమేష్,తదితరులు పాల్గొన్నారు