
జనం న్యూస్ 27 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కేటి దొడ్డి మండలం లొ పోస్టర్ ఆవిష్కరణసెప్టెంబర్ 28,29,30 తేదీలలో ఖమ్మం పట్టణంలో జరిగే ఏఐకేఎంఎస్ జాతీయ 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం ఐ యాప్ టి యు జిల్లా అధ్యక్షులు జమ్మిచేడు కార్తీక్ మట్లాడుతూ దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలపై రైతులు కూలీలు ఏకమై పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు రైతులకు 12000 ఇస్తామని,వ్యవసాయ రంగాన్ని రక్షిస్తామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని దారాదత్తం చేస్తూ నూతన వ్యవసాయ రంగ చట్టాలతో పల్లెలో నివసించే రైతులను దివాలా తీపిస్తున్నారని అన్నారు. నూతన యాప్ లను తీసుకొచ్చి ఏజెన్సీ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం వల్ల సరైన సమయానికి ఎరువులు అందకపోవడంతో రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. స్వామినాథన్ కమిషన్ సూచనల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని, విద్యుత్తు సవరణ బిల్లు, విత్తన చట్ట బిల్లు, నూతన అటవీ హక్కుల నియమాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందించుటకు జరుగుతున్న ఈ మహాసభలను రైతులు కూలీలు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం అసలు నర్సింలు వీరన్న రంగస్వామి తాయప్ప మారిన కర్రన్న నర్సింలు ఎల్లప్ప మాదన్న రవికుమార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు