
జనం న్యూస్ అక్టోబర్ 9 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాకినాడలో జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి కాకినాడ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకినాడ భారీ గృహ ప్రదర్శన-2026 కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) లాంఛనంగా ప్రారంభించారు. గృహ నిర్మాణ రంగంలో అందుబాటులో ఉన్న అవకాశాలు, ఆధునిక నిర్మాణ పద్ధతులు, స్థిరాస్తి రంగంలో వస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థిరాస్తి వ్యాపారులు, నిర్మాణ రంగ నిపుణులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.