
జనం న్యూస్ నవంబర్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడి ఓటు ఎంతో విలువైనదని అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు మండల కేంద్రంలో ముఖ్య నాయకులతో కలిసి పట్టభద్రుల ఇంటింటికి తిరిగి ఓటు నమోదు గురించి వివరించి ఓటును నమోదు చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఓటు నమోదు ప్రక్రియ నవంబర్ 6 తో ముగుస్తుంద ని మండలంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పట్టభద్రుల ఓటు నమోదు చేయించడంలో కీలక పాత్ర పోషించాలన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువత కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు చిందం సాయికుమార్ మైలారం ఉపసర్పంచ్ మస్కే కుమారస్వామి నాయకులు తడుక కుమారస్వామి శ్రీనివాస్ గోడిశాల రాజేందర్ సుకుమార్ శివ సుమన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు....