
జనం న్యూస్ నవంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఇటీవల వెలువడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన ఇద్దరు కరికాల భక్త మహిళా ప్రజాప్రతినిధులకు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవులు కల్పించాలని కూటమి పార్టీల అధిష్ఠానాన్ని, రాష్ట్ర అధ్యక్షులను కోరుతూ కరికాల భక్తులు విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం గొర్రిపూడి గ్రామ ఎంపీటీసీ విజేత శ్రీమతి జల్దాని మీనా కుమారి 1650 ఓట్ల మెజారిటీతో, పశ్చిమ గోదావరి జిల్లా పెనుమదం గ్రామ ఎంపీటీసీ విజేత శ్రీమతి చోరపల్లి అరుణాదేవి 1534 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని తెలిపారు. తమ మండలాల పరిధిలోనే వీరు టాపర్ మెజారిటీ సాధించిన వారని పేర్కొన్నారు. చేనేత వృత్తి గల కరికాల భక్తులు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని, అందువల్ల రాజ్యాధికారం దిశగా ఈ ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధులకు ఎంపీపీలుగా ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు.