
జనం న్యూస్ 28 అక్టోబర్ బుధవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా ప్రముఖ కవి డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ సంపాదకీయంలో వెలువడిన కవితాగ్ని గోళం కాళోజి పుస్తకాన్ని సిద్దిపేటలో కవులు బస్వ రాజ్ కుమార్, కాల్వ రాజయ్యలు ప్రముఖ రచయిత ఉండాళ్ళ రాజేశంకు అందజేశారు. చేయూత ప్రచురణలు ముద్రించిన కవితాగ్ని గోళం కాళోజి పుస్తక సంకలనంలో 74 కవితలు ఉండగా అందులో సిద్దిపేటకు చెందిన ఉండ్రాళ్ళ రాజేశం రచించిన మీబాటలోనే కవిత ఉండడం అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయిలో కాళోజి జయంతి సందర్భంగా ప్రచురించిన కవితాగ్ని గోళం కాళోజి పుస్తక సంకలనం ద్వారా కాళోజి ప్రజా జీవితం మొత్తం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని రాజ్ కుమార్, రాజయ్యలు అన్నారు. ఈ సందర్భంగా రచయిత ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ జాతీయస్థాయి రచనలతో ప్రచురించిన కవితాగ్ని గోళం కాళోజి పుస్తక సంకలనంలో తన రచనకు అవకాశం కల్పించడం పట్ల సంపాదకులు డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.