
జనం న్యూస్ సెప్టెంబర్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు గంధం రాజు పుట్టినరోజు వేడుకలు కేపీహెచ్బీ కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా బండి రమేష్ గంధం రాజు తో కలిసి కేక్ కట్ చేసి, పూలమాల వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గంధం రాజు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందని, కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని గంధం రాజు ని మరియు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం నిరంతర పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ కలిసి ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని గంధం రాజు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.