
జనం న్యూస్ సెప్టెంబర్ 28 కోటబొమ్మాళి మండలం : కోటబొమ్మాళిలోని శ్రీ కొత్తమ్మతల్లి అమ్మవారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. ఆలయం ప్రాంగణంలో మండపం తొలగింపు, ఫ్లోరింగ్ వేయవలసిన పరిసర ప్రాంతాల ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమానికి పూర్తిగా దిన పూర్తి చేసి క్యూలైన్లు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నేరుగా అమ్మవారిని దర్శించుకునే విధంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బార్కేడ్లు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా నిర్మాణం చేయాలన్నారు.