
జనం న్యూస్ సెప్టెంబర్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం: శివాజీ నగర్లోని జై భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, లక్ష్మణ్ గౌడ్ పర్యవేక్షణలో, తులసి రామ్ ఆధ్వర్యంలో విశ్వకర్మ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ హాజరై విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధిలో కార్మికులు, చేతివృత్తిదారులు, సాంకేతిక నిపుణుల కృషి ఎంతో గొప్పదని, వారి శ్రమను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.విశ్వకర్మ పూజా కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, స్థానికులు మరియు యూత్ అసోసియేషన్ సభ్యులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, వేముల సత్యం, అల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ వాజిద్ పాషా గీత, సునీత, భర్తలే అబ్దుల్లా, అహ్మద్, నరసింహ యాదవ్, నరసింహ గౌడ్, రాజు, స్వామి, నర్సింగ్ యాదవ్, విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.