
జనం న్యూస్ సెప్టెంబరు 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం పాలన చెయ్యలేదని, తన కోసమే అక్రమ లావాదేవీలు కోసం వేలాది కోట్లు రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేశారని, సిట్ దర్యాప్తులో వెళ్లడైందని మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు జగన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. వైసిపి హయాంలో బేవరీస్ కార్పొరేషన్ మాజీ ఓ ఎస్ డి సత్య ప్రసాద్ సంచలన వాంగ్మూలం న్యాయాధికారి ఎదుట ఇచ్చారని, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మద్యం సరఫరా కంపెనీల నుండి డిస్టలరీ కంపెనీల నుండి నెలకు 50 నుండి 60 కోట్ల రూపాయలు నెలవారి సేల్ డేటాను చూస్తే స్పష్టం అవుతుందని సిట్ తన నివేదికలో కోర్టుకు వెల్లడించిందని నాగ జగదీష్ అన్నారు. నాడు అక్రమగా సంపాదించిన మద్యం సొమ్మును కొంత తమ వాటాగా మినహాయించుకుని సింహ భాగం వివిధ మార్గాల్లో జగన్ రెడ్డికి చేర్చే వారని సత్య ప్రసాద్ వెల్లడించారని నాగ జగదీష్ తెలిపారు. జగన్ రెడ్డి నివాసంలోనే లిక్కర్ పాలసీని ఖరారు చేసి అమలు చేయాలని ఈ సమావేశంలో మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి సుమిత్ పాల్గొన్నారని, ఈ వ్యవహారాలన్నీ మిథున్ రెడ్డి విజయ్ సాయి రెడ్డి చూసుకుంటారని జగన్ వెల్లడించారని సత్య ప్రసాద్ న్యాయాధికారికి విన్నవించారని సిట్ రిపోర్టులో స్పష్టంగా ఉందని నాగ జగదీష్ అన్నారు. మద్యం కుంభకోణం లంచాల ఆధారాలు మాయం చేసేందుకు మద్యం సరఫరా ఆర్డర్లు జారీ నోట్ ఫైళ్లను ధ్వంసం చేశారని, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి నాటి సీఎంఓ కార్యదర్శి కె.ధనుంజయ రెడ్డి జగన్ ఓఎస్డి పి కృష్ణమోహన్ రెడ్డి రాజ్ కసిరెడ్డి ఈ ప్రక్రియను పర్యవేక్షించారని, నోట్ ఫైల్ లో వివరాల మార్చడం కోసం 2023 నవంబర్ రెండో తేదీ, 2024 జనవరి 22 నుండి 31 తేదీల్లో హైదరాబాదులో జూబ్లీహిల్స్ లోని ఓ భవనంలో, విజయవాడ కరెన్సీ నగర్ లోని ఎలమంచిలి హైట్స్ భవనంలోని ప్లాట్ నెంబర్ 501 లో పలుమార్లు సమావేశాలు నిర్వహించారని, అప్పటి నిఘా అధికారి పి ఎస్ ఆర్ ఆంజనేయులు సీఎంవో కార్యదర్శి కే ధనుంజయ రెడ్డి ఏపీ ఎస్ బి సి ఎల్ నాటి అంబిడి వాసుదేవ రెడ్డి జగన్ ఓ ఎస్ డి పి కృష్ణమోహన్ రెడ్డి నాటు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత భార్గవ తదితరులు వీరి సమావేశాలకు హాజరయ్యారని నాగ జగదీష్ అన్నారు. ఈ మద్యం కుంభకోణంలో 3200 కోట్లు పైగా లంచాల సొమ్మును రాజకీయ రెడ్డి తొలుత వైయస్ అనిల్ రెడ్డి గోవిందప్ప బాలాజీ( భారతి సిమెంట్ లో పూర్తికాలపు డైరెక్టర్ గా జగన్ సతీమణి భారత తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసే వ్యక్తి ) టి కృష్ణమోహన్ రెడ్డి (జగన్ ఓఎస్డి ) కె ధనుంజయ రెడ్డి (సీఎంఓ ) పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (వైసీపీ ఎంపీ ) వి విజయసాయిరెడ్డి ( రాజ్యసభ సభ్యులు) వీరికి ఎప్పటికప్పుడు మద్యం కుంభకోణం సొమ్మును అందజేశారని సిట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టంగా ఉన్నాయని నాగ జగదీష్ అన్నారు. ఈమధ్యం కుంభకోణం వల్ల 30 వేల మందికి మరణానికి కారణమైన జగన్ రెడ్డి పై క్రిమినల్ కేసులు నమోద చేసి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాగ జగదీష్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ తెలుగు యువత నాయకులు కాండ్రేగుల వెంకట సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.//