

జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలము మదన్ హిప్పర్ గా గ్రామంలో పశు సంపద అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పశు సంచార వైద్య శాలల కార్యక్రమం కింద ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ భా చ వర్ లక్ష్మణ్ ప్రారంభించారు.ఉచితంగా పశువులకు వైద్య సేవలు, గాలికుంటు నివారణ టీకాలు వేయడం, పశువులకు మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరం ద్వారా రైతులకు ఉపయోగం కలుగుతుందని అధికారులు తెలిపారు.మండల పశువైద్యాధికారి M. వినీత్ కుమార్ 27 పశువులకు వైద్యం చేశారు. 19 పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు.మేలు జాతి పశువులను కొనుగోలు చేయాలి. కృత్రిమ గర్భధారణ చేయించాలి. పశు సంపద పెంచుకోవాలి" అని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమాకాంత్ పటేల్ విజయవంతం కావడానికి సహకరించిన G. శంకర్, G. సాయిలు, K. చంద్రశేఖర్ మరియు పశువుల యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు.