తెలంగాణ

మహాకాళి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన వాసవీ మాత

మహాకాళి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన వాసవీ మాత

జనం న్యూస్ :వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 19-10-2026 సోమవారం పట్టణంలోని శ్రీశ్రీశ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు మహాకాళి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా అమ్మవారిని మహాకాళి రూపంలో విశేషంగా అలంకరించారు. భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకాళి అమ్మవారి దర్శనంతో ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో నిండిపోయింది.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

ఇ-పేపర్