జనం న్యూస్ అక్టోబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ శాసనసభ్యులు అయితా బత్తుల బుచ్చి మహేశ్వరరావు స్వర్గస్తులైన సందర్భంగా రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం శనివారం నివాళులర్పించారు. పూలమాలలతో అలంకరించిన ఆయన భౌతికకాయం వద్ద నిలబడి చేతులు జోడించి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా కంకటాల రామం మాట్లాడుతూ బత్తుల బుచ్చి మహేశ్వరరావు మృతి తీరని లోటని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఓం శాంతి.