
జనం న్యూస్ నవంబర్ 23 శాయంపేట మండలం స్థాయి ఇ ల్ టీ ఎ ప్రతిభాపాటవ పోటీలు మండలం కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అడిచెర్ల జనార్థన్ అధ్యక్షతన లో నిర్వహించారు ఇందులో భాగంగా టాలెంట్ పరీక్షల సీనియర్ విభాగంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మండల విద్యార్థి ఎం డి.అసద్ అలీ గెలుపొందగా జూనియర్ విభాగంలో రంగు.సుజయ్ విజయం సాధించారు.వక్తృత్వ పోటీల్లో భాగంగా సీనియర్ విభాగంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల శాయంపేట విద్యార్థిని వలపదాసు.అక్షయ ప్రథమ స్థానంలో నిలవగా అదే పాఠశాలకు చెందిన జి.అక్షయ జూనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది.., ., దీంతో ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయిలో జరగబోయే పోటీలకు ఎంపిక కావడం జరిగింది.., పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ధృవపత్రాలు అందజేశారు ఈ పోటీలను ఎల్టా శాయంపేట మండలం కన్వీనర్రా జిబాపూ రావు పర్యవేక్షణలో జరగగా, వారికి బాలికల పాఠశాల ఆంగ్ల ఉపాధ్యయుడు పూల శేఖర్ బాబు సహకరించారు. దీనిలో మండల విద్యాశాఖాధికారి గడ్డం బిక్షపతి పాల్గొన్నారు.., ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.