
జనం న్యూస్ 05 అక్టోబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా మత్తు పదార్థాలు గంజాయి వాడకం కేవలం వ్యక్తిగత సమస్య కాదని దాని ప్రభావం వ్యవస్థతో పాటు సమాజంపై తీవ్రంగా పడుతుందని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రదీప్ తెలిపారు. శనివారం ఆయన 4టీవీ న్యూస్ తో మాట్లాడారు. గడిచిన రెండు రోజుల్లోనే జోగులాంబ గద్వాలలో 6 నుండి 7 గంజాయి కేసులు నమోదవడం ఆందోళన కరమన్నారు. ముఖ్యంగా 20 నుండి 25 ఏళ్ల యువత ఈ వ్యసనానికి వివిధ మండలాల్లో వివిధ గ్రామాలలో విస్తరిస్తున్న బానిసలవుతుండటం విచారకరమని పేర్కొన్నారు. గంజాయి కొనుగోలుకు రోజుకు రూ.1500 నుండి రూ.2000 ఖర్చవుతుందని కూలీ డబ్బుల కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ కావడంతో యువత అప్పుల పాలుకావడం కొంతమంది వ్యాపార నేతలు కుటుంబం కలవడం కోసం ఈ నేరాలకు పాల్పడటం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో స్పందించి మత్తు పదార్థాల నిర్మూలనకు సహకరించాలని పిలుపునిచ్చారు డాక్టర్ సైకాలజిస్ట్ ప్రదీప్ కుమార్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలు ఈ అన్యాయాన్ని ఎదురుకోవడానికి అన్యాయాన్ని అన్యాయానికి బానిస అవుతున్న యూత్‌ని కాపాడుకోవాలని హెచ్చరించారు ప్రభుత్వం దీనికి సహకరించి దీనికోసం స్పెషలిస్ట్ టీం తయారు చేసి మత్తు పదార్థాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు