
జనం న్యూస్ నవంబర్ 3 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా (అర్బన్) కార్మిక విభాగం (లేబర్ సెల్) కన్వీనర్ కర్నాటి యోగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక విభాగం (లేబర్ సెల్) కన్వీనర్ అందే శ్రీనివాస్ సమక్షంలో, ప్రశాంత్ నగర్ డివిజన్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు మద్దుల చంద్రప్రకాష్ రెడ్డి జిల్లా (అర్బన్) లేబర్ సెల్ కో-కన్వీనర్‌గా నియమితులైన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు చంద్రప్రకాష్ రెడ్డి ని శాలువాతో ఘనంగా సత్కరించి, నూతన బాధ్యతలు చేపట్టినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ, పార్టీ కోసం నిబద్ధతతో, క్రమశిక్షణతో నిరంతరం కష్టపడుతూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త సేవలను పార్టీ ఎప్పటికప్పుడు గుర్తిస్తుందని, వారి శ్రమకు తగిన సమయంలో తగిన బాధ్యతలు, అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు.నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.