
జనం న్యూస్ సెప్టెంబర్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాముమ్మిడివరం నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో డీజే సౌండ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసి అధిక శబ్దంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని ముమ్మిడివరం సీఐ మోహన్ కుమార్ తెలిపారు.ప్రజల ప్రశాంతతకు, విద్యార్థులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలిగించే విధంగా అధిక శబ్దంతో డీజేలు నిర్వహించరాదని సూచించారు.మాట చెప్పుకోలేని మూగ జీవాలకు అదే శబ్దం భయంగా మారవచ్చునని తెలిపారు.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే డీజే నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎలాంటి వేడుకలకైనా ముందస్తు అనుమతి తప్పనిసరని, పరిమితికి మించిన శబ్దం వినియోగిస్తే సామగ్రిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజలు కూడా నిబంధనలను పాటించి శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని సీఐ కోరారు.