
కోరుట్ల మండలం, పట్టణ లబ్ధిదారులకు రూ.12.42 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
జనం న్యూస్, నవంబర్ 12, జగిత్యాల జిల్లా : మెట్పల్లి మెట్పల్లి మండల ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మరో ముందడుగు పడింది. మెట్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో మెట్పల్లి మండలానికి ఎమ్మెల్యే కోటాలో మంజూరైన 82 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.అదేవిధంగా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల మండలం, పట్టణానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం రూ.12,42,000 (పన్నెండు లక్షల నలభై రెండు వేల రూపాయలు) విలువైన 54 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ప్రభుత్వ పథకాల ద్వారా అర్హులైన పేదలకు గృహ వసతి కల్పించడంతో పాటు, అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత అందించే కార్యక్రమాల్లో భాగంగా ఈ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు.