
40 ఏళ్లకు పైగా సేవలందించిన సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ రామ శర్మ
జనం న్యూస్, అక్టోబర్ 29: జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎల్ఐసీ శాఖ చరిత్రలో తొలిసారిగా ఉద్యోగి పదవీ విరమణ చేయ నుండటం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ శాఖలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీ రామశర్మ 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ సేవలందించి అక్టోబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు.నాలుగు దశాబ్దాలకు పైగా ఎల్ఐసీ సంస్థలో విధులు నిర్వహించిన శ్రీ రామ శర్మ ఉద్యోగ ప్రస్థానం ముగియనుండటంతో ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని ఆత్మీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ 30వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సన్మాన కార్యక్రమం జరగనుంది.మెట్పల్లి శాఖలో తొలి పదవీ విరమణ కార్యక్రమంగా నిలవనున్న ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఎల్ఐసీ సిబ్బంది హాజరుకానున్నారు. సుదీర్ఘకాలం సంస్థకు సేవలందించిన శ్రీ రామ శర్మకు పలువురు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.