
జనం న్యూస్ అక్టోబర్ 15: ననిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఏర్గట్ల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడుఏనుగందుల రాజా పూర్ణానందం అన్న శంకర్ మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా ఏర్గట్ల మాజీ జెడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్ బావ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, నాగులపెల్లి అంజి రెడ్డి, క్యాతం దేవేందర్, అశోక్ యాదవ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.