
జనం న్యూస్ అక్టోబర్ 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని వసంతపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చల్ల పాపమ్మ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట బీజేపీ మండల అధ్యక్షులు నరహరిశెట్టి రామకృష్ణ , బీజేవైఎం నాయకులు లాడే శివ కుమార్ , మై భారత్ జిల్లా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.