
అమ్మకు అక్షరమాల కార్యక్రమంపై రిసోర్స్ పర్సన్స్ కు అవగాహన
జనం న్యూస్-మే 14- నాగార్జునసాగర్ టౌన్- నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో అమ్మకు అక్షరమాల (ఉల్లాస్) కార్యక్రమానికి సంబంధించి మెప్మా రిసోర్స్ పర్సన్స్, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులకు, ఓబి మెంబర్స్ కు, ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. నందికొండ మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ చదువు రాని వారికి చదువు చెప్పి చదవటం అక్షరాలు వ్రాయటం అంకెలను గుర్తించడం వంటివి నేర్పడమే ఉల్లాస్ కార్యక్రమం అని అన్నారు. నిరక్షరాసులై, సమస్యలతో బాధపడే మహిళలకు రక్షణ కల్పించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహద పడుతుందని అన్నారు. మహిళా సాధికారత లో భాగంగా 18t సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసుగల మహిళలకు అక్షర జ్ఞానము అందించడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ ఉల్లాస్ కార్యక్రమంనీ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా టిఎంసి బక్కయ్య, సురేష్ మరియు రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.