
జనం న్యూస్ మే 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : పాడేరు మోదుకొండమ్మ అమ్మవారు దర్శించుకోవడానికి ఈరోజు ఉదయం మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు పాలకమండలి సాదరంగా ఆహ్వానించి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించి అనంతరం కమిటీ వారు శాలువాలతో సత్కరించి అర్చకులు ఆశీర్వదించారు. ఈనెల 13వ తేదీన నారా లోకేష్ కిడారి శ్రావణ కుమార్ పెళ్లి సందర్భంగా పాడేరు విచ్చేస్తున్నoదున పాడేరు పరిశీలకలుగా ఉన్న నాగ జగదీష్ ఈరోజు మధ్యాహ్నం పాడేరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గిడ్డి ఈశ్వరి మాజీ ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాగ జగదీష్, గుమ్మడి సంధ్యారాణి మంత్రివర్యులు, పరిశీలకులు హర్షవర్ధన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ పార్టీ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటిసారిగా పాడేరు విచ్చేస్తున్న సందర్భంగా ఘనంగా స్వాగతం పలకడానికి పాడేరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను పాల్గొని లోకేష్ కు స్వాగతం పలకవలసిందిగా నాగ జగదీష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ ధర్మకర్త యలమంచిలి బంగారు రాజు పాడేరు నియోజకవర్గ నాయకులు బోర్ర నాగరాజు ప్రసాదు సుబ్బారావు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.//