జనం న్యూస్ అక్టోబర్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బాలానగర్ డివిజన్ పరిధిలోని నవజీవన్ నగర్లో పాస్టర్ క్రిస్టఫర్ మరియు సులోచన ఆధ్వర్యంలో “హెల్త్ ఈజ్ ఏ బ్లెస్సింగ్” అనే నినాదంతో మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజన్న తో పాటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ. ప్రజల ఆరోగ్యమే సమాజానికి నిజమైన సంపద అని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. నేటి బిజీ జీవితంలో అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు వైద్య పరీక్షలు ఎంతో అవసరమని తెలిపారు. ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మెడికల్ క్యాంపులను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం ద్వారా ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ మెడికల్ క్యాంపు నిర్వహించిన పాస్టర్ క్రిస్టఫర్, సులోచనను బండి రమేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, లక్ష్మయ్య, పులి శివకుమార్ గౌడ్, శ్రీకాంత్ పటేల్, మధు మోహన్, జిల్లా శివ, జావిద్, రేణుక, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.