
జనం న్యూస్ నవంబర్ 19 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో ఎల్ ని నో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని గ్రామసభ నిర్వహించారు ఎల్ నీ నో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి అవకాశాల నేపథ్యంలో గ్రామస్తులు రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని గ్రామ సర్పంచ్ శేషాద్రి పలు సూచనలు తెలియజేశారు ఈ మేరకు చండూరు గ్రామంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించి నీటి పొదుపు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు భూగర్భ జలాలు పెంపునకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని వర్షపు నీటిని ఒడిసిపెట్టి భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవాలని కోరారు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకొని నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామపంచాయతీ సెక్రటరీ మండలంలోని వివిధ శాఖల అధికారులు వార్డు సభ్యులు మాజీ బీఆర్ఎస్ ఉప సర్పంచ్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.