
జనం న్యూస్ అక్టోబర్ 31 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 2026 అక్టోబర్ 31 వ తేదీన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన అధికారులు తమ సుదీర్ఘ సేవా కాలంలో ప్రజలకు, పోలీస్ శాఖకు అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా సేవ, నేర నియంత్రణతో పాటు శాఖ అభివృద్ధికి వారు చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. వారి సేవాభావానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని, తమ అనుభవాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని ఆకాంక్షించారు.పదవీ విరమణ పొందిన అధికారులు:మహమ్మద్ హాజీ మియా, ఎస్ఐ-1889, బాలానగర్ పోలీస్ స్టేషన్.జె. రవీందర్, ఏఎస్ఐ-883, రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్.ఈ కార్యక్రమంలో డీసీపీ (అడ్మిన్) టి. అన్నపూర్ణ, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ వై.వి.ఎస్. సుధీంద్ర, కార్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ పి. సంజీవ, జేఏఓ (బడ్జెట్) బి. నర్సింహారావు, ఎస్టేట్ ఆఫీసర్ ఆర్ఐ హిమాకర్, కో-ఆపరేటివ్ సొసైటీ ఇన్చార్జి ఎస్ఐ జి. మల్లేశం, సైబరాబాద్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు బి. శ్రీనివాస్,జి. గోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జె. మల్లేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె. శ్రీనివాస్, కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ పి. అశోక్ తదితరులు పాల్గొన్నారు.అలాగే ఇతర డీసీపీలు, ఏసీపీలు, పోలీస్ అధికారులు, సైబరాబాద్ పోలీస్ అసోసియేషన్ సభ్యులు, కో-ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.