
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా 22-10-2026 గురువారం పెబ్బేరు పట్టణంలో పండుగల సాయన్న 174వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగల సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పండుగల సాయన్న జీవితాన్ని,ఆయన పోరాట స్ఫూర్తిని, ప్రజల కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు, ధైర్యసాహసాలు, సామాజిక చైతన్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహనీయుల చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.ఈ జయంతి వేడుకలో పండుగల సాయన్న సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రేరణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మత్స్య పరిమిక సహకార సంఘం సభ్యులు అధ్యక్షులు చింతకాయల కురుమూర్తి,గోనెల బాలస్వామి, గోనెల సహదేవుడు,సొప్పరి బీచ్చుపల్లి(జిల్లా డైరెక్టర్) చింతకాయల భీముడు, సంగనమోని శ్రీనివాసులు, చింతకాయల శివ కరెన్న,తిరుపతయ్యా రాజు,శాంతయ్య, ఎల్లయ్యా,k.రాముడు,సాయి హమాలీ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు, కటికల శివాజీ,బజారు అంజి,ప్రకాష్,కాశీ, బోల్గరి నరసింహ స్థానిక ప్రజలు,యువకులు, అభిమానులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.