
జనం న్యూస్ అక్టోబర్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఫతేనగర్ డివిజన్ పరిధిలోని వాల్మీకి నగర్ సొసైటీ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రోడ్డుకు ఇరువైపులా డబ్బాలు ఏర్పాటు చేసుకొని, చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్న పేద వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంబంధిత అధికారులను కోరారు.గత వారం ఎంఎంసీ కమిషనర్ వినయకృష్ణ రెడ్డి ప్రాంతంలో పర్యటించిన సందర్భంగా అక్కడ ఉన్న డబ్బాలను తొలగించాలని ఆదేశించినట్లు స్థానిక చిరు వ్యాపారులు తెలిపారు. దీంతో ఎన్నో ఏళ్లుగా చిరు వ్యాపారాలపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న పేదలు ఆందోళనకు గురయ్యారు.ఈ నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యే వాల్మీకి నగర్ ప్రాంతంలో పర్యటించి, స్థానిక చిరు వ్యాపారుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కమిషనర్ తో మాట్లాడి, ఎన్నో ఏళ్లుగా చిరు వ్యాపారాల ద్వారా జీవనోపాధి పొందుతున్న పేదలను ఇబ్బందులకు గురిచేయకుండా, వారికి సహకరించాలని కోరారు.దీనిపై స్పందించిన కమిషనర్ రోడ్డుపై చెత్తాచెదారం పేరుకుపోకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, డబ్బాల విషయంలో చిరు వ్యాపారులను అనవసరంగా ఇబ్బంది పెట్టబోమని హామీ ఇచ్చారు.దీనిపై స్థానిక చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. తమ జీవనోపాధికి అండగా నిలిచిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి కృతజ్ఞతలు తెలిపారు.పేదల జీవనోపాధిని కాపాడుతూ, అదే సమయంలో పరిసరాల పరిశుభ్రతను కూడా పరిరక్షించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.అధికారులు ae వరుణ్ దేవ్, జలమండలి మేనేజర్ హిమజ ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు రాములు, కంచి బిక్షపతి, సుదర్శన్ రేడ్డీ ఆఫ్జాల్ ,సాయి ,వినయ్ ,రమేష్ లక్ష్మణ్, వేణు, నందు పాల్గొన్నారు