తెలంగాణ

ఫోక్ సాంగ్ ప్రోమో విడుదల చేసిన వడ్డేపల్లి రాజేశ్వరరావు

ఫోక్ సాంగ్ ప్రోమో విడుదల చేసిన వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ అక్టోబర్ 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రైవేట్ సాంగ్ ఆల్బమ్ “నా రంగరాజు బంగారు బావ” ప్రోమోను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఈరోజు ఆల్బమ్ నిర్మాతలు శ్రీనివాస్ మహారాజ్, రేవంత్ మహారాజ్‌ల ఆహ్వానం మేరకు వారి సమక్షంలో విడుదల చేశారు. ఈ పాటను విగ్నేష్ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, ఆల్బమ్ రూపకల్పన కోసం కృషి చేసిన నిర్మాతలు, కళాకారుల శ్రమకు తగిన గుర్తింపు లభించాలని ఆకాంక్షించారు. యువత తమలోని ప్రతిభను గుర్తించి, సంగీతం, సినిమా, డిజిటల్ మీడియా వంటి వివిధ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చు కోవాలని సూచించారు. స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకుంటూ తమ ప్రతిభతో ఎదగడమే కాకుండా, సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా, “నా రంగరాజు బంగారు బావ” పాటను ప్రేక్షకులందరూ వీక్షించి, లైక్ చేసి, విగ్నేష్ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని, తమ ఆదరణను అందించాలని వడ్డేపల్లి రాజేశ్వరరావు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. కళాకారులను ప్రోత్సహించడం ద్వారా వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని, మరిన్ని మంచి పాటలు, సృజనాత్మక కార్యక్రమాలు రూపొందించేందుకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.అనంతరం ఆల్బమ్ నిర్మాతలు శ్రీనివాస్ మహారాజ్, రేవంత్ మహారాజ్‌లకు ఈ ఆల్బమ్ మంచి విజయం సాధించి, ప్రేక్షకుల ఆదరణ పొందాలని, భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన కార్యక్రమాలు చేపట్టాలని వడ్డేపల్లి రాజేశ్వరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇ-పేపర్