
సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం
జనం న్యూస్- అక్టోబర్ 23- నాగార్జునసాగర్ టౌన్- పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ వ్యవస్థ చట్టాలు మరియు శాంతిభద్రతల పరిరక్షణ పై స్థానిక సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా నాగార్జునసాగర్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ కే సతీష్ మాట్లాడుతూ పోలీసుల పట్ల విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా సమాజం పట్ల బాధ్యతను పెంచడమే ఈ ఓపెన్ హౌస్ ఉద్దేశమని విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని మంచి పౌరులుగా ఎదగాలి చెడు అలవాట్లకు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అని తెలిపారు. విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు పోలీస్ స్టేషన్లో నిర్వహించే నేరాల నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పోషించే పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు పోలీస్ శాఖలోని వివిధ విభాగాల పనితీరు ప్రజల భద్రత కోసం పోలీసులు ఉపయోగించే పరికరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు అత్యవసర పరిస్థితులలో పోలీసులు స్పందించే విధానం నేరాల నివారణలో ప్రజల సహకారం చట్టాల పట్ల గౌరవం వంటి అంశాలను విద్యార్థులకు తెలియజేశారు, పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తి క్రమశిక్షణ సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఓపెన్ హౌస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల భద్రత షీ టీమ్స్ బాల్యవివాహాల నిరోధకం గంజాయి మరియు మాదకద్రవ్యాల నిరోధక చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు పోలీసుల విధులపై అవగాహన పెరగడంతో పాటు పోలీసులు ప్రజల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని నాగార్జునసాగర్ టౌన్ ఎస్ఐ కే సతీష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాగార్జునసాగర్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.