
జనం న్యూస్15 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ను ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలు అప్రతిష్టపాలు చేసేందుకు కొంతమంది బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలకు తెరలేపుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంఏ ఎజాస్ మండిపడ్డారు. మంగళవారం రోజున స్థానిక కాంగ్రెస్ భవన్లో మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక సోషల్ మీడియాలో వీడియోలు, నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ప్రచారమేనని ఆయన అన్నారు. అయిలన్న ఎదుగుదలను ఓర్వలేక కొందరు బట్టకాల్చి మీదేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలు ఈ తరహా రాజకీయాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. నిజంగా ఆరోపణల్లో వాస్తవం ఉంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక వ్యక్తిగత విమర్శలు, తప్పుడు ప్రచారాలకు పాల్పడటం చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. అయిలన్నను ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని, నిజం–అబద్ధం ప్రజల ముందే తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.