
జనం న్యూస్ 17 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఇటీవల తెలుగు రాష్ట్రాల నుండి కొందరు దివ్యాంగ మిత్రులు కాల్ చేసి కుటుంబ సహకారం లేక ఉద్యోగాలు రాక చనిపోవాలనిపిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పుట్టినప్పటి నుండి సమాజంలో ఎన్నో అవమానాలు శారీరక సవాళ్లు ఎదుర్కొని, ఈ రోజు డిగ్రీలు పీజీలు పూర్తి చేసే స్థాయికి వచ్చామంటే మన ధైర్యం ఎంత గొప్పదో గుర్తించండి అంతటి సవాళ్లను దాటుకుని వచ్చిన మనం, ఈ రోజు ప్రాణాలు తీసుకునేంత బలహీనులం కాదు ఆత్మహత్య అనేది దేనికీ పరిష్కారం కాదు మనకు ఏం కావాలి మన జీవితాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే దానిపైనే ఆలోచిద్దాం మీ కోసం ఉదయ్ టీమ్ ఉంది మీ ఉద్యోగాలు ఉపాధి మరియు హక్కుల సాధన కోసం ఉదయ్ అసోసియేషన్ నిరంతరం పనిచేస్తోంది.ఎవరూ అధైర్యపడొద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ వెనుక మేమున్నాం అని ఉదయ్ టీమ్ మీకు మాట ఇస్తోంది సహాయం లేదా ధైర్యం కోసం ఎప్పుడైనా ఉదయ్ టీమ్‌ను సంప్రదించండి.ఉదయ్ అసోసియేషన్.