
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 21. నందలూరు రైల్వే పరంగా అభివృద్ధి చెందాలని రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాజు సోమవారం గుంటకల్ లోని డివిజనల్ రైల్వే కార్యాలయం నందు వివిధ విభాగాల రైల్వే ఉన్నత అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు, నూతన రైల్వే రన్నింగ్ రూమ్ ఏర్పాటుకు కృషి చేసినటువంటి సీనియర్ డిఈఈ,టి ఆర్ ఎస్ ఓ ,ఆర్ నాగేశ్వరరావునికలిసి కృతజ్ఞతలుతెలియజేశారు, ఈ సందర్భంగా సీనియర్ డి ఈ ఈ మాట్లాడుతూ లోకో రన్నింగ్, స్టాఫ్,లో భాగమైన 10 మంది లోకో పైలట్లని నందలూరుకు శాంక్షన్ చేస్తున్నామని చెప్పడం జరిగిందని రైల్వే రన్నింగ్ రూమ్ నిర్మాణంనకు మంజూరు చేసిన టువంటి రైల్వేసీనియర్ డిఈఎన్ కోఆర్డినేషన్ బి సాయి రాజు కి రాచూరి మురళి కృతజ్ఞతలు తెలియజేశారు ,సీనియర్ డిఈఎన్ కో ఆర్డినేషన్ మాట్లా డుతూ ఇప్పుడు ఉన్న రన్నింగ్ రూమ్ చాలా పాతబడినదిని రైల్వే రన్నింగ్ స్టాఫ్ ఇచ్చినటు వంటి సూచనలను పరిగణలోకి తీసుకొని నూతన రైల్వే రన్నింగ్ రూమ్ కు ఆమోదం తెలిపామని రైల్వే రన్నింగ్ స్టాప్ కు భద్రత ఆధునికత కల్పించాలని ఉద్దే శంతో రైల్వే ఉన్నత అధికారులు తీసుకున్న నిర్ణయమని తెలియ జేశారు ఈ సందర్భంగా రాచూరి మురళి మాట్లాడుతూ నంద లూరు రైల్వే స్టేషన్ నందు ట్రైన్లకు వాటరింగ్ రైల్వే ల్యాండ్,డెవలప్మెంట్ అథారిటీ కింద రైల్వే స్థలాన్ని అభివృద్ధి చేయవలసినదిగా నందలూరు మండల ప్రజల ద్వారా ఆయన కోరారు. అందుకు రైల్వే గుంట కల్ డివిజన్ అత్యున్నత అధి కారులు మాట్లాడుతూ నంద లూరు నుండి వచ్చే ప్రతి అంశము పరిగణలోకి తీసుకొని నందలూరు రైల్వేపరంగా అభి వృద్ధి చేస్తామని అధికారులు తెలియ జేసినట్లు మురళి తెలియజేశారు.