
జనం న్యూస్ 15 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలోని రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందు కు వినతిపత్రం సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని ప్రస్తుతం విద్యుత్ కోతలతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గత ప్రభుత్వం టిఆర్ఎస్ 24 గంటలు కరెంటు ఉచిత కరెంటు ఇచ్చింది ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో కరెంటు గోవిందా వర్షం గోవిందా ప్రపంచం కాంగ్రెస్సే గోవిందా అన్నట్లు చేస్తున్నది ప్రభుత్వం నాయకులు వర్షం లేక ఒక దిక్కు రైతులు విలవిల ఆడుతున్నారు ఉన్నదాంట్లో సర్దుకుందామా అంటే ఉన్న కరెంటు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసి ఇతర రాష్ట్రాలకు కరెంటు అమ్ముకుంటున్నారు మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? రైతే రాజు అన్నారు ఆనాడు పెద్దలు ఈరోజు రైతు పొలం చేయాలంటేనే భయం వేస్తుంది ప్రభుత్వం ఇప్పుడైనా చొరవ తీసుకొని 24 గంటల కరెంటు అందించాలని కోరుకుంటున్నారు ప్రజలు అధికారులకు తెలియజేయడానికి చేపడుతున్న ఈ కార్యక్రమానికి గద్వాల నియోజకవర్గంలోని రైతులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను మన సమస్యను మనమే అధికారుల దృష్టికి తీసుకెళ్లాం రైతుల కోసం మన గొంతును బలంగా వినిపిద్దాం అందరం కలిసి ముందుకు సాగుదాం మీ అందరినీ ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాను సింధనూరు ఉప్పరి గంగాధర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జోగులాంబ గద్వాల జిల్లా