
జనం న్యూస్ అక్టోబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి ( గ్రంధి నానాజీ) డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రూరల్ లో జిల్లా యువమోర్చా అధ్యక్షుడు గాణాల కళ్యాణ్,ప్రధాన కార్యదర్శి తోలేటి సూర్య గంగాధర్ ఆధ్వర్యంలో మోదీ సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా విద్యార్థులకు పలకలు,పుస్తకాలు,కలాలు పంపిణీ చేశారు.బిజెపి మండల అధ్యక్షుడు ఆకేటి శ్రీకృష్ణ,జిల్లా సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ నాగిరెడ్డి సతీష్ రావు పాల్గొన్నారు.విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు చేరాలని నాయకులు ఆకాంక్షించారు.ప్రధాని మోదీ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.భవిష్యత్తులో మరిన్ని విద్యా సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.