
జనం న్యూస్ సెప్టెంబర్ 19 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) రామారెడ్డి మండలం మున్నూరు కాపు మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. మండల అధ్యక్షులుగా లాగల మైపాల్, ప్రధాన కార్యదర్శి బండి లింగం, గౌరవ అధ్యక్షులు చెన్నం శెట్టి రమేష్, ప్రచార కార్యదర్శిగా కడెం సాయికుమార్, లను గ్రామ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవ ఎన్నుకున్నారు. అదేవిధంగా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన పైడాకుల లింగం కూతురు పైడాకుల మేఘన మెడిసిన్ లో ప్రభుత్వ కళాశాలలో సీటు సాధించినందుకు జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ రావు పటేల్, ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కడెం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కాల హనుమాన్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెట్టి గాడి అంజయ్య, కోశాధికారి కుంటి ఆంజనేయులు, జిల్లా బాధ్యులు వెంకట్రాజ్యం, రమేష్, రాజు,లు పాల్గొన్నారు.రామారెడ్డి మండల మాజీ అధ్యక్షు లు కడెం శ్రీకాంత్, గతంలో చేసిన సేవలను గుర్తించి జిల్లా శాఖ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది.