
*జనం న్యూస్ 13 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్*జోగుళాంబ గద్వాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీ యువకుడి ఇంటిని సర్పంచ్ ప్రేరేపణతో కొందరు దుండగులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించిన. డాక్టర్ ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ బి ఆర్ యస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇది అమానవీయ సంఘటన. సభ్య సమాజం సిగ్గుతో తలదించు కునే నేరం అందరు బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి ఇది కులాంతర వివాహం అని తెలిసినా మేజర్ అయిన అమ్మాయి తాను ఇష్ట పూర్వకంగానే వివాహం చేసుకున్నాను అని పోలీసులకు తెలిపినా వాళ్లు ఈ జంటకు, వారి ఆస్తులకు రక్షణ కల్పించలేకపోయారు ఆ బాధిత యువతి సర్పంచ్ కుట్ర తోనే ఈ విధ్వంసం జరిగిందని స్పష్టంగా చెప్పినా యాప్ ఐ ఆర్ లో ఎందుకు చేర్చడం లేదు, రేవంత్ రెడ్డి దళితులపై నకిలీ ప్రేమ చూపించడం కాదు వారి ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించండి. స్పీకర్ దీని మీద అసెంబ్లీలో ప్రత్యేక చర్చ చేయించాలని కోరుతున్నాను. ఈ పేద కుటుంబాల కన్నీళ్లను కూడా తుడిచే బాధ్యత తీసుకోండి.@ తెలంగాణ డి జి పి