
జనం న్యూస్ 11 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్సీ సెల్ కార్యవర్గాలను రద్దు చేసిన దరిమిలా నూతన కార్యవర్గాల నియామకం కొరకు జోగులాంబ గద్వాల్ జిల్లాలోని డిసిసి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుని నియామకం కొరకు దరఖాస్తులు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంచార్జ్ అబ్జర్వర్ గా వినోద్ సింగిల్ హాజరయ్యారు. రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి తగిన గుర్తింపునిచ్చేలా అధ్యక్ష నియామకం ఉంటుందని తెలిపారు.అనంతరం జిల్లా ఎస్సీ సెల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో మూడు సంవత్సరాల కు పైగా పనిచేసిన అనుభవం, నిబద్ధతగా పనిచేసిన వారిని గుర్తించి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులుగా నియమించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి ఈనెల 10వ తారీఖు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.