
సేవే లక్ష్యంగా… సమాజమే కుటుంబంగా… ప్రజాసేవే మార్గంగా ముందుకు సాగుతున్న బందయ్య గారికి మరియు వారి సతీమణికి హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు!
జనం న్యూస్ 28 అక్టోబర్ వికారాబాద్ జిల్లా :- పూడూర్ మండలం, మిటకంకల్ గ్రామానికి చెందిన ఆదర్శ దంపతులు మోర్రీ సరిత-చిన్న బందయ్య(అనిల్) వివాహ వార్షికోత్సవం అత్యంత ఆనందకర వాతావరణంలో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల నుండి ఈ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిన్న బందయ్య (అనిల్) దంపతులు, సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. నిస్వార్థ భావంతో ఇతరులకు సాయం చేస్తూ, కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయన ప్రత్యేకత. సమాజ సంక్షేమం కోసం ఆయన అందిస్తున్న సహకారం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. 'సేవే లక్ష్యంగా' ముందుకు సాగుతున్న ఈ దంపతులు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, దేవుని దయతో ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని గ్రామస్తులు మనసారా ఆకాంక్షిస్తున్నారు.ఈ సందర్భంగా మోర్రీ సరిత-చిన్న బందయ్య(అనిల్) దంపతులకు హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు.— గ్రామస్తులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు,