
విద్యార్థులకు క్రీడా దుస్తులు, జామెంట్రీ బాక్సులు, స్వీట్లు, పంపిణీ జనం న్యూస్ నవంబర్ 23 నాగార్జునసాగర్ టౌన్- సత్య సాయి బాబా జయంతి వేడుకలను పురస్కరించుకొని నాగార్జునసాగర్ లోని శ్రీ సత్య సాయి సేవ మందిరం ట్రస్టు సభ్యులు ఎస్ విఎస్ఎస్ఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎంపీయుపిఎస్ గాంధీ బజార్ పైలాన్ కాలనీ పాఠశాలలో విద్యార్థులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపియుపిఎస్ విద్యార్థులకు 100 స్పోర్ట్స్ డ్రెస్సులు, జామెంట్రీ బాక్సులు, స్వీట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల్లో చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతోపాటు వారికి అవసరమైన విద్య సామాగ్రిని అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా సత్యసాయి సేవా మందిరం నిర్వాహకులు తెలిపారు. మానవసేవే మాధవసేవ అనే సత్యసాయిబాబా ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సత్యసాయిబాబా బోధించిన ప్రేమ, సేవా, మానవత్వం అనే విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సత్యసాయి సేవా మందిరం నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు ఎంఎస్ఎన్ రాజు, వి రాఘవన్,
జిసి శ్రీనివాస్, పెదవుర ఎంఈఓ తరిరాము, తిరుమలగిరి సాగర్ ఎంఈఓ కే శ్రీనివాస్, కాంప్లెక్స్ హెచ్ఎం పిశేషు, పాఠశాల హెచ్ఎం కే సహదేవి, ఉపాధ్యాయులు ఎన్ జెస్సికా, ఎం ప్రసన్నకుమారి, డి నిర్మల కుమారి, బి చైతన్య, జేశివశంకర్,
పివిపి హనుమకుమార్, జి మంగమ్మ,రిషిత,రాధా, దివ్య, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.