
జనం న్యూస్ సెప్టెంబర్ 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శివ హిల్స్ గ్రేటెడ్ కమ్యూనిటీలో నరేష్ దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన “నాని కిచెన్స్” ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బండి రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి నాని కిచెన్స్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు నరేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, నాని కిచెన్స్ మరింత అభివృద్ధి చెంది మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నరేష్ దంపతులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.