
జనం న్యూస్ 17 సెప్టెంబర్ గురువారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ శ్రీనారాయణి అవధాన వేదిక అవధాన విద్యావికాస పరిషత్, మియాపూర్ మిత్ర మిండలి వారి సంయుక్త నిర్వహణలో బండకాడి అంజయ్య గౌడ్ అవధానం కూకట్పల్లిలో నిర్వహించారు. అధ్యక్షులుగా చింతా రామకృష్ణారావు, సంచాలకులు మరుమాముల దత్తాత్రేయ శర్మ, బైరపనేని పోతురాజు, ముద్దు రాజయ్య, అసనారె మాచవోలు ఇంకా చాలామంది కవుల సమక్షంలో 47వ అవధానం చేసిన అంజయ్య గౌడ్ కు అవధాన కళానిధి బిరుదు ప్రదానం చేసి ఘనంగా సన్మానం చేశారు. సిద్దిపేటకు చెందిన అంజయ్య గౌడ్ అవధాన కళానిధి బిరుదు పొందడం పట్ల సిద్దిపేట రచయితలు ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, సింగీతం నరసింహారావు, కాల్వ రాజయ్య, బస్వ రాజ్ కుమార్, కోణం పరశురాములు, నల్ల అశోక్, ఆదిమూలం చిరంజీవి తదితరులు అభినందనలు తెలిపారు. త్వరలోనే సిద్దిపేటలో అంజయ్య గౌడ్ మరోక అవధానం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.