
జనం న్యూస్:10 అక్టోబర్ శనివారం సిద్దిపేట నియోజికవర్గ ఇంచార్జి వై.రమేష్: ముఖ్య అతిథులుగా తన్నీరు హరీష్ రావు, చైర్మన్ మంజుల రాజనర్సు,న్యాయవాది యాసల వెంకట్ లింగం విచ్చేశారు,శ్రీవాణి స్కూలు డైరెక్టర్ సి.హెచ్ సత్యం సిద్దిపేటలోని భారత్ నగర్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయినులు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. సత్యం మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఇటువంటి వేడుకల ముఖ్య ఉద్దేశమని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయినులు కలిసి బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంతో పాఠశాలలో చివరి రోజు వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ముగిశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయినిలు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.