
జనం న్యూస్ జహీరాబాద్: జూలై 14 : జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు పత్తు నాయక్ తండా హోతికేలో నిర్వహించిన SIR కార్యక్రమంలో BRS నాయకుడు రవికుమార్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వార్డు ప్రజలతో కలిసి కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు ప్రజా సమస్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, వారి సమస్యలను వినిపించుకున్నారు. ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, అవసరమైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రవికుమార్ చౌహాన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. స్థానిక అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని రవికుమార్ చౌహాన్ తెలిపారు. కార్యక్రమంలో వార్డు పెద్దలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు తండా వాసులు పాల్గొన్నారు.