ఆంధ్రప్రదేశ్

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన పంచాయతీ కార్యదర్శి, జీపీఓ.

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన పంచాయతీ కార్యదర్శి, జీపీఓ.

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం 16-10-2026 శుక్రవారం నాడు రంగాపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ కుమార్,జీపీఓ దేవన్న లబ్ధిదారులకు పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.లబ్ధిదారుల పూర్తి వివరాలతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డును ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు రేషన్ కార్డు పొందని అర్హులైన వారు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని నూతన రేషన్ కార్డులు పొందాలని తెలిపారు.

ఇ-పేపర్