
*జనం న్యూస్, 15 నవంబర్, ( మరియు నియోజకవర్గ రిపోర్టర్ హనుమంత్ రెడ్డి ) వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని సోమన్ గుర్తి అంగన్వాడి కేంద్రంలో బాలల దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, అంగన్ వాడీ కేంద్రాల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో వేడుకల్లో పాల్గొన్నారు.అంగన్వాడి కేంద్రంలో పాఠశాలల్లో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాసరచన, చిత్రలేఖనం, పాటలు, నృత్యాలు, ప్రసంగ పోటీలు నిర్వహించారు. చిన్నారులు రంగురంగుల దుస్తులు ధరించి తమ ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ అంగన్వాడి టీచర్ అరుణా దేవి మాట్లాడుతూ, పిల్లలే దేశ భవిష్యత్తు అని, నెహ్రూ పిల్లలను ఎంతో ప్రేమించేవారని, అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నా మని తెలిపారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి తల్లిదండ్రులకు, గ్రామానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, స్వీట్లు పంపిణీ చేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో , విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొరు