
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు
ముఖ్య అతిథులుగా హాజరైన నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ టౌన్ ఎస్సై సతీష్
జనం న్యూస్ -సెప్టెంబర్ 19- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ బీసీ స్కూల్ వెనుక స్ఫూర్తి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ టౌన్ ఎస్ఐ సతీష్ లు హాజరై స్ఫూర్తి యూత్ కమిటీ సభ్యులతో కలిసి గణేశునికి ప్రత్యేక పూజలు చేశారు, అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు, భక్తిశ్రద్ధలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐ శీను నాయక్ మాట్లాడుతూ యువత భక్తి భావంతో పాటు సమాజ సేవలో కూడా ముందుండాలని పిలుపునిచ్చారు. ఎస్సై సతీష్ మాట్లాడుతూ యువత సామాజిక బాధ్యత ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టటం ఆనందనియమని అన్నారు, ఈ అన్న ప్రసాదవితరణ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు . ఈ సందర్భంగా స్ఫూర్తి యూత్ సభ్యులు మాట్లాడుతూ తమకు ప్రతి సంవత్సరం సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలకు, భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.