
జనం న్యూస్ నవంబర్ 20 ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం: అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మేనేజర్ రవణం స్వామినాయుడును దాట్ల బాబు ముమ్మిడివరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు కాసేపు ఆప్యాయంగా ముచ్చటించుకుని, సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, యువత చైతన్యం గురించి చర్చించారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను కలిసి ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. స్వామినాయుడు చేస్తున్న రక్తదాన సేవలను దాట్ల బాబు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అవసరంలో ఉన్నవారికి సమయానికి రక్తం అందించడంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చేస్తున్న కృషి అభినందనీయమని దాట్ల బాబు పేర్కొన్నారు. యువతను సేవా మార్గంలో ముందుకు నడిపించడంలో ఇద్దరూ కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ కలయిక స్థానికంగా ఆసక్తికరంగా మారింది.